May 26, 2009

R.NARAYANA MURTHY AS SOFTWARE ENGINEER

రాబోయే ఆర్. నారాయణ మూర్తి సినిమా “వైకుంఠపాళి” లోని పాట. ఇందులో నారాయణ మూర్తి గారు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్.ఆర్ధిక సంక్షోభం వల్ల ఉద్యోగం పోగొట్టుకొని..ఇలా…
ఏమున్నదక్కో ఓ ఏమున్నదక్కా…
పొట్ట పెరిగిపొయి..జుట్టు రాలిపొయి…వున్న పరువు పొయి..
ఈ ఇండస్ట్రీ లొ నాకింక
ఏమున్నదక్కో.. ఏమున్నది అక్కొ ఏమున్నది అక్క..
B.Tech చేసినాకా (సామి
హైదరాబాద్ చేరుకున్నా(సామి
ఎక్స్ పీరియన్స్ అడుగుతుంటే ఆ ఆఅ ఆఅవ్
ఎక్స్ పీరియన్స్ అడుగుతుంటే, ఎంత కావాలి అంటే అంత పెట్టి, జాబ్ కొట్టినా, జాయిన్ అయ్యినా బాంచన్…
(ఏమున్నదక్కో ఓ ఏమున్నదక్కా…)
ట్రైనింగులివ్వక పాయె (సామి
క్లయింటు ఇంటరాక్షన్ అన్నాడు (సామి
కమ్యునికేషన్ బాలెదు అంటె అ ఆ ఆఅ
కమ్యునికేషన్ బాలెదు అంటె , కుమిలి కుమిలి ఏడిచిన, హిందు పేపర్ వేయించినా బాంచన్…
(ఏమున్నదక్కో ఓ ఏమున్నదక్కా…)
ప్రాజెక్టు ఇచ్చిండు వాడు (సామి
పేస్లిప్ కూడ వచ్చింది (సామి
పేస్లిప్పు చూపించీ. అ అ అ అ అ అ ఆఆఆఆ
పేస్లిప్పు చూపించీ, క్రెడిట్ కార్డ్ తీసుకున్న, అవసరం లేనివన్ని కొన్నా…అప్పులపాలు అయినా బాంచన్…
(ఏమున్నదక్కో ఓ ఏమున్నదక్కా…)
ప్రాజెక్టు అయిపోయింది (సామి
కొత్తాది వస్తాది అన్నడు (సామి
బెంచ్ లోన పెట్టిండు ఆఆ అ ఆ ఆఆఅ
బెంచ్ లోన పెట్టినాకా సబ్జెక్టు మరిచిపొయినా, ఓ రోజు మా HR పిలిసిండు పొయి కలిసినా బాంచన్…
(ఏమున్నదక్కో ఓ ఏమున్నదక్కా…)
బూము తగ్గింది అన్నాడు (సామి
కాస్టు కట్టింగు అన్నాడు (సామి.
బెంచిలో వున్నా అని చెప్పీ ఆఆ అ అ అ అ ఆఆ
బెంచిలో వున్నా అని చెప్పీ బయటికి తోసిండు..నా కొంప కూల్చిండు బాంచన్…
(ఏమున్నదక్కో ఓఓ ఏమున్నదక్కా…)
చాతి బాగా ముందుకు నెట్టి..రెండూ చేతులు గట్టిక వెనక్కి పట్టి…ఆర్. నారాయణ మూర్తి స్టయిల్లో..ఒక్కసారి “హ్హా”
ఇట్లు
ఆర్. నారాయణ మూర్తి
Infy నారాయణ మూర్తి గా అవుదామని సాఫ్ట్ వేర్ లోకి వచ్చి “ఒరెయ్..నారిగా” గ మారిన ఒక యువకుడి క(వ్య

2 comments:

  1. keka... chinchesadu...rasinavariki hats off..... thanks andi 4 posting

    ReplyDelete